స్వామి వారు వారణాసి నుంచి మధువర్ణ నర్మదా బాణలింగం గాను , కామాక్షీ అమ్మవారు కంచి నుంచి కామాక్షీ అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉన్న శిల్పాలయం లో మలచబడి ఇక్కడకు వేంచేశారు.
వివిధ అంతరాలయ, పరివార దేవతలు కూడా కంచి నుంచే వేంచేశారు.
ఈ ప్రతిష్ఠ కార్యక్రమములు మార్చి 2, 2017 న మొదలై ఐదు రోజుల పాటు పంచాధివాసాలు, రుద్ర హోమము, చండీ హోమము, మూల మంత్ర హోమములు, శ్రీ చక్రార్చన, చండీ సప్తశతి పారాయణం, శ్రీ రుద్ర పారాయణం, ప్రతిష్ఠిత సర్వ దేవతా జపములు మరియూ చతుర్వేద పారాయణములు, గర్తన్యాసం, నవరత్న న్యాసం, నేత్రోన్మీలనం, గోవీక్షణం, కళాన్యాసం, అఖండ మహా పూర్ణాహుతి, శిఖర దివ్య ప్రతిష్ఠలు, శాంతి కళ్యాణం తో స్వస్తిశ్రీ దుర్ముఖి నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ నవమి, సోమవారం మార్చి 06, 2017 ఉదయం 11-05 ని: ప్రతిష్ఠ కార్యక్రమములు సుసంపూర్ణం అయ్యాయి.
శ్రీ కామాక్షీ సమేత ఏకామ్రేశ్వర స్వామి వారి ఆలయం లో అయ్యవారు, అమ్మవారి తో పాటు , శ్రీ చండీశ్వరుడు;
అంతరాలయం లో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు,
ఉపాలయాలలో శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారలు.
స్వామివారి ఆలయ పరివార దేవతలుగా శ్రీ వైష్ణవీ దుర్గ, శ్రీ బ్రహ్మ, శ్రీ మహా విష్ణువు, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ నిధన గణపతి.
అమ్మవారి ఆలయ పరివార దేవతలుగా శ్రీ బ్రాహ్మి, శ్రీ మాహేశ్వరి, శ్రీ మహాలక్ష్మి వేంచేసియున్నారు.