amma-ayya-Home-scaled-blurred

శ్రీ కామాక్షీ సమేత ఏకామ్రేశ్వర స్వామి వారి ఆలయం శైవాగమ సిధ్ధాంతానుసారముగా స్థానిక పెద్దల సహకారాలతో, తమ స్వంత ఖర్చు తో, నిర్మించే అవకాశం చి: అక్కిన సోమేశ్వర సునీల్ - చి: సౌ: అక్కిన అనూష దంపతులకు తమ పూర్వజన్మ పుణ్య ఫలంగా ఆ పరమేశ్వరుడు లభింపచేసాడు. ఈ ఆలయం కాకినాడ సరిహద్దుల్లో రమణయ్య పేట పంచాయతీ, రాయుడుపాలెం లో గల గోకుల్ గార్డెన్స్ లో నిర్మించబడింది. ఈ ఆలయం లో స్వామివారు సద్యోజాత (పశ్చమ) ముఖం గా కొలువైయున్నారు. సద్యోజాత శివాలయాలు అరుదు, అవి చాలా శక్తివంతమైనవని, భక్తుల ధార్మికమైన కోరికలు ఈ స్వామి దర్శనము వలన సులభంగా నెరవేరుతాయని శాస్త్ర ఉవాచ.