amma-ayya3

ఆలయం లో జరిగే ప్రత్యేక ఉత్సవాల వివరాలు

మహాశివరాత్రి

మహాశివరాత్రి మాహా పుణ్య దినం నాడు విశేష అభిషేకములు, పంచకాటక పారాయణములతో అన్నాభిషేకం, లింగోద్భవకాల అభిషేకములు, అభిషేకాన్నం తో ప్రసాద వితరణ, జరుగుతున్నాయి.

ఆలయ బ్రహ్మోత్సవాలు

ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతీ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి నుంది ఫాల్గుణ శుద్ధ నవమి వరకు త్రిదవస ఉత్సవాలుగా జరుపబడుతాయి. మొదటి రెందు రోజులు స్వామి వారికి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఉంతాయి. మూడవ రోజు ఉదయం స్వామి అమ్మవార్ల ఊరెరిగింపు తదంతరం శాంతికాల్యణం ఘనంగా జరుగుతాయి.ఈ కార్యక్రమంలో చాలామంది దంపతులు సామూహిక కల్యాణంలో భాగస్వామ్యులు అవుతారు . మధ్యాహ్నం జరిగే మాహ అన్నసమారాధనకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి కొన్ని వేల మంది ప్రజలు వస్తారు. సాయంత్రం అయ్యవారికి అమ్మవారికి మహా పుష్పోత్సవం, ఉయ్యాల సేవ, వేదస్వస్తి కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుపబడతాయి.

గురు పౌర్ణమి

గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక: అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ: ''గు'' అంటే అంధకారం, ''రు'' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఝానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఝానబోధ చేశాడని శివపురాణంచెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఝాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది.
వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ పరాశరులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.
వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.
ఆషాఢ పూర్ణిమ నాడు గురు పౌర్ణమి సందర్భం గా గురుమండల ప్రతిష్ట, వ్యాస మూర్తి పూజ జరుగుతున్నాయి.

శాకంభరి

దేవీ భాగవతము నందలి 7 వ స్కంధం నందు శతాక్షి అను అమ్మవారి కధ కలదు. రురు అను అసురుని పుత్రుడు దుర్గముని కారణంగా భూలోకంలో వేదములు లుప్తమయ్యాయి యజ్ఞములు ఆగి పోయి దేవతలుదుర్బలులు అయ్యారు. అందువల్ల నూరు సంవత్సరములు వర్షములు పడలేదు ప్రాణి కోటి అల్లకల్లోలం చెందింది. దుర్గముడు సృష్టించిన కాటక సమయము లోన అమ్మవారు తమ దేహమున శాకములు ఫలింపచేసి భక్తులైన మానవులందరిని రక్షించెను.
వర్షములు కురియనంతవరకు అమ్మవారి శరీరం నందు పుట్టినట్టివియును ప్రాణులను రక్షిణించునట్టివియును ఐన శాకములు చేత (ఆహారపదార్థముల చేత) అమ్మవారు సకల విశ్వమును కాపాడుచుండెను , శాకములు భరించుటచేత అమ్మవారు "శాకంభరి" గా లోకమున ప్రసిద్ధి గాంచినది, ఆషాఢ మాసం లో ఒక రోజు (కామాక్షీ) అమ్మవారిని "శాకంభరి" గా వివిధములైన శాకములతో అలంకరించి కొలుచుకొనే ఆచారం కలదు.
మన ఆలయం లో ఆషాఢమాసం ఆఖరి సోమవారం అమ్మవారిని శాకంభరి గా కొలుచుకొంటున్నాము

వినాయక చవితి

భాద్రపద శుద్ధ చవితి నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు- ప్రతీ రోజు ఉదయం మూల మూర్తికి అభిషేకం వార్షిక మూర్తికి ప్రాతఃకాల పూజ, ప్రదోష కాల గణేశ సహస్ర నామార్చన, వినాయక చవితి నాడు లక్ష్మి గణపతి హోమము జరుపబడుతున్నాయి. ప్రతీ సంవత్సరం పర్యావరణ సంరక్షణలో భాగం గా ఒక్క మృణ్మయము తో చేసిన వినాయక మూర్తి ని మాత్రమే వార్షిక మూర్తి గా ప్రతిష్టించడం జరుగుతోంది. పదవ రోజు స్వామి వారి ఊరెరిగింపు, అన్నసంతర్పణ, నిమజ్జన కార్యక్రమాలు

దేవీ శరన్నవరాత్రులు

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రద్ధగా జరుపబడుతున్నాయి. పాడ్యమి మొదలు దశమి వరకు శ్రీ కామాక్షీ అమ్మవారికి - శ్రీ స్వర్ణ కవచాలంకార దుర్గా దేవి, శ్రీ బాలాత్రిపురసుందరి, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ అన్నపూర్ణా దేవి , శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి, శ్రీ సరస్వతీ దేవి (మూల నక్షత్రమున ) , శ్రీ దుర్గా దేవి, శ్రీ మహిషాసురమర్ధినీ దేవి , శ్రీ రాజరాజేశ్వరీ దేవి గా అలంకారములు జరుప బడుతున్నాయి.
ప్రతీ రోజు అమ్మవారికి అభిషేకం, ఆ అవతారం నకు సంబందించిన అలంకారం, వివిధ స్తోత్ర పారాయణాలు, చండీ సప్తశతీ పారాయణము, చండీ పాఠ పారాయణ, భజనలు, జరుపబడుతున్నాయి.
మూల నక్షత్రమున, శ్రీ సరస్వతీ దేవి కి పిల్లలు, పెద్దలతో పుస్తక పూజ జరుపబడుతున్నాయి.
ప్రతీ రోజు ప్రసాద వితరణ.
నవమి/దశమి నాడు చండీ హోమం, శమీ వృక్ష పూజ జరుపబడుతున్నాయి

కార్తిక మాస పూణ్యకాలం

ఇక కార్తికమాసం అంతా ఆలయంలో ఎన్నో ప్రత్యేక పూజలు, భక్తజన సందోహం తో ఆలయ ప్రాంగణం అంతా కిలకిలా లాడుతుంటుంది.
కార్తిక మాసం నెలంతా ప్రతీ రోజు ఉ: 5:30 ని: లకు శ్రీ ఏకామ్రేశ్వరస్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకవార/ఏకాదశ రుద్రాభికం.
ప్రతీ రోజు సాయంత్రం ఆకాశదీప ప్రజ్వలన,
ప్రతీ సోమవారం మరియూ ఇతర పర్వదినములందు - శు: ఏకాదశి, మాసశివరాత్రి, త్రయోదశి, పౌర్ణమి, త: దినములలో సాయంత్రం ప్రత్యేక హారతులు.
ఏకాదశినాడు సాయంత్రం సహస్ర జ్యోతిర్లింగార్చన,
పౌర్ణమి నాడు జ్వాలాతోరణ మహోత్సవం.
మాసశివరాత్రి నాడు సహస్ర బిల్వాపత్రార్చన.
శాంతి కళ్యాణం, పుష్పోత్సవం, ఉయ్యాలసేవ జరుగుతున్నాయి